రేపటినుండి ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు

ఏపీ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబవుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 13న ధ్వజారోహణం, పోతన జయంతి, 14న శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. ఏప్రిల్ 18న సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. టీటీడీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించి, పనులు వేగవంతం చేసింది. గతేడాది గాలివాన భీభత్సంతో కళ్యాణానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలువ పందిళ్లు విరిగి, విద్యుత్ […]

రేపటినుండి ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు

Edited By:

Updated on: Apr 12, 2019 | 3:57 PM

ఏపీ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబవుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 13న ధ్వజారోహణం, పోతన జయంతి, 14న శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. ఏప్రిల్ 18న సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. టీటీడీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలకు సంబంధించిన ప్రణాళికను రూపొందించి, పనులు వేగవంతం చేసింది. గతేడాది గాలివాన భీభత్సంతో కళ్యాణానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలువ పందిళ్లు విరిగి, విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. రూ.40 లక్షలు వెచ్చించి కల్యాణ వేదికను విస్తరించారు.

సీతారాముల వివాహాన్ని చంద్రుడు నేరుగా తిలకించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. కల్యాణ వేదిక ప్రాంగణంలోకి భక్తులు ప్రవేశించేందుకు మూడు ప్రధాన స్వాగత తోరణాలకు సెట్టింగులు వేస్తున్నారు. దాదాపు, 60 వేల మంది కూర్చుని కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఆలయం నుంచి సీతారాములను తీసుకొచ్చే శోభాయాత్ర కోసం 20 అడుగుల వెడల్పుతో మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీ, అగ్నిమాపక కేంద్రం, మీడియా ప్రసారాలు, వైద్య శిబిరాల నిర్వహణ కోసం వేర్వేరుగా చలువ పందిళ్లు వేస్తున్నారు. భక్తులకు దాహార్తి సమస్య రాకుండా 6.10 లక్షల తాగునీటి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. వీటితోపాటు మజ్జిగను కూడా అందజేయనున్నారు.