తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత సహచరురాలు శశికళ జైలు నుంచి త్వరలో విడుదల కానుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తనక్లయింటు ర్.. 10 కోట్ల జరిమానా చెల్లించారని, గడువుకు ముందే ఆమె విడుదల కావచ్ఛునని ఆమె లాయర్ రాజా సెందూర్ పాండ్యన్ తెలిపారు. బెంగుళూరులోని కోర్టులో ఈ మొత్తాన్ని డీడీల రూపంలో చెల్లించామన్నారు. నిజానికి శశికళ వచ్ఛే ఏడాది జనవరి 27 న విడుదల కావలసి ఉంది. అయితే ఫైన్ చెల్లించాం గనుక ముందే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ఆమె విడుదల అయినప్పటికీ ఆమెను గానీ, ఆమె కుటుంబాన్ని గానీ అన్నా డీఎంకే లోకి అనుమతించే ప్రసక్తి లేదని సీఎం పళనిస్వామి చెప్పారు. శశికళ విషయంలో పార్టీ వైఖరి మారలేదన్నారు.