ఇన్‌స్టాగ్రామ్‌లో విరుష్క జంట ప్రేమాయణం

|

Dec 11, 2019 | 8:10 PM

విరాట్‌, అనుష్క జంట ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సరదా సరదా ట్వీట్లు, ఫొటోలు షేర్‌ చేస్తూ వార్తల్లో ఉంటారు. ఐతే 2017 డిసెంబర్‌ 11న పెళ్లితో ఒక్కటైన ఈ జంట..పెళ్లి చేసుకొని నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ఒక వ్యక్తిని ప్రేమించడమంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్లే అని ప్రముఖ కవి విక్టర్‌ హూగో కొటేషన్‌ను పెట్టి పెళ్లి నాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో […]

ఇన్‌స్టాగ్రామ్‌లో విరుష్క జంట ప్రేమాయణం
Follow us on

విరాట్‌, అనుష్క జంట ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సరదా సరదా ట్వీట్లు, ఫొటోలు షేర్‌ చేస్తూ వార్తల్లో ఉంటారు. ఐతే 2017 డిసెంబర్‌ 11న పెళ్లితో ఒక్కటైన ఈ జంట..పెళ్లి చేసుకొని
నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.

ఒక వ్యక్తిని ప్రేమించడమంటే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్లే అని ప్రముఖ కవి విక్టర్‌ హూగో కొటేషన్‌ను పెట్టి పెళ్లి నాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది అనుష్క శర్మ. దీనికి
స్పందించిన విరాట్‌ కూడా తమ వివాహనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. నిజ జీవితంలో ప్రేమ తప్ప మరేదీ లేదు. మీకు అర్థమయ్యే వ్యక్తితో మిమ్మల్ని జతగా కలిపి
ఆశీర్వదించాడు. అని అనుష్కను ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టాడు. విరుష్క జంట పోస్టులకు క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు..నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
తెలిపారు.