కరోనా ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన విగ్రహాల కొనుగోలు..!

ఎప్పటిలా కాకుండా ఈ సంవత్సరం కరోనా వల్ల వినాయక విగ్రహాల సేల్స్ భారీగా పడిపోయాయని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన విగ్రహాల కొనుగోలు..!

Updated on: Aug 22, 2020 | 12:40 PM

Vinayaka Statue Sales Down: కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఈ ఏడాది వినాయక చవితిని హంగూ ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటున్నారు. తమ ఇళ్లలోనే మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటిలా కాకుండా ఈ సంవత్సరం కరోనా వల్ల వినాయక విగ్రహాల సేల్స్ భారీగా పడిపోయాయని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విగ్రహాల కోసం మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వారని… ఈసారి మాత్రం కొనుగోలు చేయడానికి కస్టమర్లే లేరంటూ విగ్రహాలు అమ్మేవారు తమ బాధను వెళ్లబుచ్చుకుంటున్నారు.

లాక్‌డౌన్ కారణంగా విగ్రహాల తయారీకి సరిగ్గా మెటీరియల్ లభించకపోవడమే కాకుండా.. వాటి తయారీకి పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావడం లేదని తెలిపారు. గతంలో రూ. 1500 వరకు విగ్రహాలు అమ్మేవాళ్లమని.. ఇప్పుడు కేవలం రూ.200 వరకు మాత్రమే అమ్మగలుగుతున్నామని అన్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతున్నామని విగ్రహ తయారీదారులు లబోదిబోమంటున్నారు.

Also Read: Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..