ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. సీఎం జగన్ ఎన్నికల హామీ ప్రకారం గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ గ్రామ వాలంటీర్ ఉద్యోగాల నియామకం గురించి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలవద్దకు నేరుగా చేర్చేందుకు వీరు వారధిలా పనిచేస్తారని ఆయన ప్రకటించారు. ఆగస్టు 15 నాటిని నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టుగా సీఎం ఆనాడు ప్రకటించారు. దీని అమలులో భాగంగా శనివారం గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
ఈ ఉద్యోగాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. దీనిద్వారా అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18నుంచి 35 సంవత్సరాల వయసుకలిగిన వారు దీనికి అర్హులు. రిజర్వేషన్లను పాటిస్తూనే ఈ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 50 శాతం ప్రాధాన్యత కల్పించారు. ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీరును నియమిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీరికి నెలకు రూ.5వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు గ్రామస్ధాయిలో ఇంటర్ ఉత్తీర్ణత, పట్టణస్ధాయిలో డిగ్రీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదో తరగతి విద్యార్హతలుగా నిర్ణయించారు.
ఈ దరఖాస్తులను ఈనెల 24 నుంచి జూలై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ http://gramavolunteer.ap.gov.