అందుకే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశా.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గొప్ప నటుడు అని, ఆయనను మించిన నటులు ఎవరూ ఉండరని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

అందుకే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశా.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..

Updated on: Dec 10, 2020 | 5:40 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గొప్ప నటుడు అని, ఆయనను మించిన నటులు ఎవరూ ఉండరని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టానన్న విజయశాంతి.. తన తర్వాతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఉద్యమం కోసమే తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. విలీనం తరువాత మెదక్ ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు విజయశాంతి. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశ్యంతో కేసీఆర్ తనను అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ అనుమతితోనే ఇచ్చంపల్లి సమస్యపై నాడు వైఎస్ఆర్‌ను కలిశానని విజయశాంతి చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కావాలనే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరుల త్యాగ ఫలంతో గద్దెనెక్కిన కేసీఆర్.. వారి శవాలపై కూర్చుని పాలన సాగిస్తున్నారంటూ ఘాటైన పదజాలంతో దుమ్మెత్తిపోశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us