AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మాస్టర్’ టీజర్ విడుదల, అదిరగొట్టిన విజయ్, పోరుకు రెడీ అంటోన్న సేతుపతి

దీపావళి సందర్భంగా తమిళ  స్టార్ హీరో విజయ్‌ నటించిన 'మాస్టర్‌' సినిమా టీజర్​ను విడుదల చేసింది మూవీ యూనిట్. 'నాకు తెలుసు సర్‌.. జేడీ ఒక నేరస్థుడు...

‘మాస్టర్’ టీజర్ విడుదల, అదిరగొట్టిన విజయ్, పోరుకు రెడీ అంటోన్న సేతుపతి
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2020 | 9:14 PM

Share

దీపావళి సందర్భంగా తమిళ  స్టార్ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ సినిమా టీజర్​ను విడుదల చేసింది మూవీ యూనిట్. ‘నాకు తెలుసు సర్‌.. జేడీ ఒక నేరస్థుడు. అయినా.. ఒక సాధారణ ప్రొఫెసర్‌ ఇంత డేంజరస్ వ్యక్తిగా ఎందుకు మారాడు..?’ అనే డైలాగ్‌తో టీజర్​ ప్రారంభమైంది. మంచి ఫైట్ సీన్లతో ఈ వీడియో​ ఆద్యంతం సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఇందులో హీరో విజయ్‌ ఒక స్టైలిష్‌, పవర్‌ఫుల్‌ ప్రొఫెసర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. విజయ్, విజయ్ సేతుపతి మధ్య సాగే సన్నివేశాలు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన లోకేష్‌ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన విజయ్‌ సేతుపతి విలన్‌గా  నటించారు. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందించారు. అర్జున్‌ దాస్‌, సిమ్రన్‌, భాగ్యరాజ్‌, ఆండ్రియా, శ్రీనాథ్‌, సంజీవ్‌ గౌరీ కిషన్‌, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. మరి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మాస్టర్ పేరుతో వస్తుండటంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది.  స్నేహితుడు, తుపాకి,  అదిరింది, సర్కార్, విజిల్ సినిమాతో విజయ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.   మాస్టర్ సినిమాతో విజయ్ మరిన్ని రికార్డులు తిరగరాస్తాడని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ