
కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతుంటే చైనా పక్కనే ఉన్న వియత్నాం మాత్రం కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగింది. ఇక్కడ కేసులు ఇప్పటికీ వందల్లోనే ఉండటం గమనార్హం. మృతుల సంఖ్య దాదాపు సున్నా అని వియత్నాం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ చిన్నదేశం కరోనాను ఎలా కట్టడి చేసింది?
కాగా.. అతి చిన్న దేశమైన వియత్నాం అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు కరోనా తమ దేశంలో వ్యాపిస్తే వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమని అంచనా వేశారు. వెంటనే చైనాతో ఉన్న సరిహద్దును దాదాపుగా మూసివేశారు. చైనాలోని లాక్‌డౌన్ జనవరి 20 తర్వాత ప్రారంభం కాగా వియత్నాంలో జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో అమలు చేశారు.