కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. పార్టీ పదవికి రిజైన్ చేసిన వెంటనే ఓ సినిమా హాల్లో ప్రత్యక్షమయ్యారు. రాహుల్ పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తున్న వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని చాణక్య మల్టీప్లెక్సీలో.. ఆర్టికల్ 15 మూవీకి వెళ్లారు. ఓ సాధారణ పౌరుడిలా జనం మధ్యనే కూర్చొని సినిమా చూశారు. అదే థియేటర్లో ఉన్న ఓ యువతి రాహుల్ గాంధీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.