ఏపీలో మూడు రాజధానులపై రగడ నడుస్తున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. అన్నీ ఒకే చోట పెట్టడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలకు, రాజకీయాలకు సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు వెంకయ్య. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ తొలి స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో నిట్ పెట్టడంలో ఉద్దేశం కూడా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమేనన్నారు ఉపరాష్ట్రపతి. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకయ్య ఈ కామెంట్స్ చేశారు.
రైతుల బాధలు, ఇబ్బందులు తనకు తెలుసని.. సమస్య పరిష్కరించేవారికి సమాచారం అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారని.. రాష్ట్రాభివృద్ధి కోసం నేను చేయాల్సింది ఎప్పుడూ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.