గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న త‌నికెళ్ల భ‌ర‌ణి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటాడు సినీ నటుడు తనికెళ్ళ భరణి. అనంతరం భ‌ర‌ణి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత యజ్ఞం రూపంలో..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న త‌నికెళ్ల భ‌ర‌ణి

Edited By:

Updated on: Aug 27, 2020 | 12:31 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటాడు సినీ నటుడు తనికెళ్ళ భరణి. అనంతరం భ‌ర‌ణి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా విస్తరించి ముందుకు తీసుకెళ్తున్నారని సినీ నటుడు తనికెళ్ళ భరణి అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ నటుడు తనికెళ్ళ భరణి. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం మరో నలుగురు సుహాసిని మణిరత్నం, డైరెక్టర్ త్రివిక్రమ్, సినీ నటులు నాజర్, ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.

Read More:

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మ‌ధ‌ర్ థెరిస్సా మాట‌ల‌ను గుర్తు చేసిన‌ చిరు

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు

జ‌గ‌న‌న్న విద్యాకానుక: విద్యార్థుల‌కు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే