సౌండ్ పెంచితే సీజ్!

బుల్లెట్ బైక్ కొని నడపాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితో కొన్న బైక్‌ను అలానే తోలరు. తనకు కవాల్సిన విధంగా రీ మోడలింగ్  చేయించుకుంటారు.

సౌండ్ పెంచితే సీజ్!

Updated on: Nov 02, 2020 | 5:43 PM

బుల్లెట్ బైక్ కొని నడపాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితో కొన్న బైక్‌ను అలానే తోలరు. తనకు కవాల్సిన విధంగా రీ మోడలింగ్  చేయించుకుంటారు. రోడ్డుపై వెళ్తుంటే అందరి ద‌ృష్టి తమపై పడాలని భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు పెట్టిస్తారు. అయితే వీటి వల్ల శబ్ద కాలుష్యంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇలా అతి చేసే ఆకతాయిల బెండు తీయడానికి పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు.  జంగారెడ్డి గూడెంలో నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. భారీగా శబ్ధాలు చేసే వాహనాలను సీజ్ చేశారు. బుల్లెట్ వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ తీసేసి అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త మోటార్ చట్టం ప్రకారం.. ద్విచక్రవాహనాన్ని మాఢిఫై చేసి సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Also Read : బాలయ్య సినిమాలో తారకరత్న !