నేటి నుంచి తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వసంత మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. గురువారం తిరుమలలో రథోత్సవం జరగనుంది. కాగా వసంతోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు తిరుమలలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 10కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 6గంటల సమయం […]

నేటి నుంచి తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

Edited By:

Updated on: Apr 17, 2019 | 1:30 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వసంత మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. గురువారం తిరుమలలో రథోత్సవం జరగనుంది. కాగా వసంతోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు తిరుమలలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.

ఇదిలా ఉంటే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 10కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 81,413మంది భక్తులు దర్శించుకున్నారు.