వకుళామాత ఆలయం.. ఆధారాలు లభించాయి..

|

Aug 05, 2020 | 8:30 PM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయంలో దశాబ్దాల నాటి శాసనం బయటపడింది. 11వందల 1వ సంవత్సరంలో చోళ చక్రవర్తి కులోత్తోంగ చోళ.. ఈ శాసనాన్ని రాయించారు. వకుళా మాత ఆలయం గోపురం ఎదుట ఈ శాసనం కనిపించింది. వకుళమ్మ ఆలయంతోపాటు విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించి విగ్రహం ప్రతిష్టించినట్టుగా శాసనంలో ఉంది. ఇన్నాళ్లు ఈ ఆలయానికి సంబంధించి వివాదం జరుగుతోంది. ఇది వకుళా మాత అలయమా కాదా అనే రచ్చ నడుస్తోంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం […]

వకుళామాత ఆలయం.. ఆధారాలు లభించాయి..
Follow us on

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయంలో దశాబ్దాల నాటి శాసనం బయటపడింది. 11వందల 1వ సంవత్సరంలో చోళ చక్రవర్తి కులోత్తోంగ చోళ.. ఈ శాసనాన్ని రాయించారు. వకుళా మాత ఆలయం గోపురం ఎదుట ఈ శాసనం కనిపించింది. వకుళమ్మ ఆలయంతోపాటు విష్ణుమూర్తి ఆలయాన్ని నిర్మించి విగ్రహం ప్రతిష్టించినట్టుగా శాసనంలో ఉంది.

ఇన్నాళ్లు ఈ ఆలయానికి సంబంధించి వివాదం జరుగుతోంది. ఇది వకుళా మాత అలయమా కాదా అనే రచ్చ నడుస్తోంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదనేది కొందరి వాదన. టీటీడీ కూడా ఇక్కడ వకులామాత ఆలయం ఉందనడానికి ఆధారాలు లేవని చెప్పింది. పైగా ఇన్నాళ్లు చారిత్రక ఆధారాలు కూడా లేవు.

మైనింగ్‌ మాఫియా చేతిలో పడి కొండంతా కరిగిపోయింది. కొందరు కోర్టును ఆశ్రయించారు. ఎన్నో వివాదాల తర్వాత ఇది వకుళామాత అలయమే అంటూ కోర్టు తీర్పునిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఖర్చుతో ప్రస్తుతం ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆలయ పనులు పూర్తి కావొస్తున్న సందర్భంలో ఆలయ గోపురం ముందు కాంక్రీట్ వేస్తుండగా బండపై ఓ శాసనం కనిపించింది