Vakeel Saab Teaser: పవన్ పుట్టినరోజుకు వకీల్ సాబ్ టీజర్..?

Vakeel Saab Teaser: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీనితో తీవ్ర నిరాశతో ఉన్న ఫ్యాన్స్‌కు కాస్త ఉపశమనం కలిగించేలా చిత్ర యూనిట్ ఓ […]

Vakeel Saab Teaser: పవన్ పుట్టినరోజుకు వకీల్ సాబ్ టీజర్..?

Updated on: Jul 14, 2020 | 11:34 PM

Vakeel Saab Teaser: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీనితో తీవ్ర నిరాశతో ఉన్న ఫ్యాన్స్‌కు కాస్త ఉపశమనం కలిగించేలా చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ తీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.