వ్యాక్సిన్ వచ్చేస్తోంది… గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ కంపెనీ

కరోనపై పోరులో కీలకవిజయం సాధించినట్టు అమెరికన్‌ ఫార్మా కంపెనీ ఫైజర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్టు ఫైజర్‌ తెలిపింది. తమ వ్యాక్సిన్‌ కరోనా రాకుండా 90 శాతం నియంత్రణ ఇస్తుందని స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

వ్యాక్సిన్ వచ్చేస్తోంది... గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ కంపెనీ

Updated on: Nov 09, 2020 | 6:45 PM

Covid Vaccine :  కరోనపై పోరులో కీలకవిజయం సాధించినట్టు అమెరికన్‌ ఫార్మా కంపెనీ ఫైజర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్టు ఫైజర్‌ తెలిపింది. తమ వ్యాక్సిన్‌ కరోనా రాకుండా 90 శాతం నియంత్రణ ఇస్తుందని స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఏడురోజుల్లో వాలంటీర్లకు వ్యాధి నిరోధక శక్తి వచ్చినట్టు వెల్లడించింది. తొలిదశలో వ్యాక్సిన్‌ వేసుకున్న వాలంటీర్లలో 28 రోజుల తరువాత ఇమ్యూనిటీ పవర్‌ వచ్చినట్టు వివరణ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఇది గుడ్‌న్యూస్‌ అని ఫైజర్‌ పేర్కొంది.

94 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తరువాత పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయ్యింది. 164 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఫైజర్‌ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ప్రస్తుతం ఫైజర్‌ సంస్థ 50 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. 2021 నాటికి 1.3 బిలియన్‌ డోస్‌లను తయారు చేస్తామని తెలిపింది.