సీన్ రివర్స్, నిందితులకు న్యాయం జరగాలంటూ, అగ్రవర్ణాల ఆందోళన

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2020 | 1:54 PM

హత్రాస్ కేసులో కొత్త ట్విస్ట్ ! ఈ కేసులో నిందితులకు న్యాయం జరగాలంటూ, వారికి మద్దతుగా అగ్రవర్ణాలకు చెందినవారమని చెప్పుకుంటున్న కొందరు ఆదివారం బాధితురాలి ఇంటివద్ద నిరసనకు దిగారు.  మొదట బీజేపీ లీడర్ రాజ్ వీర్ సింగ్..

సీన్ రివర్స్, నిందితులకు న్యాయం జరగాలంటూ, అగ్రవర్ణాల ఆందోళన
Follow us on

హత్రాస్ కేసులో కొత్త ట్విస్ట్ ! ఈ కేసులో నిందితులకు న్యాయం జరగాలంటూ, వారికి మద్దతుగా అగ్రవర్ణాలకు చెందినవారమని చెప్పుకుంటున్న కొందరు ఆదివారం బాధితురాలి ఇంటివద్ద నిరసనకు దిగారు.  మొదట బీజేపీ లీడర్ రాజ్ వీర్ సింగ్ పహల్వాన్ ఇంటి వద్దకు చేరుకున్న వీరు అక్కడే బైఠాయించారు. అయితే తన వ్యక్తిగత హోదాతో తానీ ఆందోళనలో పాల్గొంటున్నానని, పార్టీతో దీనికి సంబంధం లేదని ఆ పహల్వాన్ అంటున్నారు. అటు-బాధితురాలి కుటుంబంపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని, నిందితులను తప్పుడుగా టార్గెట్ చేశారని తనను అగ్రకులస్థుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.

కాగా-ఈ అగ్రవర్ణాల మీట్ గురించి తనకు తెలియదని జాయింట్ మేజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాష్ మీనా చెప్పారు. బాధితురాలి కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని, రాజకీయ నేతలు అయిదుగురు చొప్పున ఆ ఫ్యామిలీని కలిసి పరామర్శించవచ్చునని  ఆయన అన్నారు. చూడబోతే ఈ కేసు మెల్లగా నీరు కారిపోయేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.