బయటివాళ్లు అక్కడ అడుగుపెడితే రూ.5 వేలు జరిమానా కట్టాల్సిందే!

| Edited By:

Apr 06, 2020 | 5:51 PM

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ‘సామాజిక దూరం’ సరైన అస్త్రమంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో

బయటివాళ్లు అక్కడ అడుగుపెడితే రూ.5 వేలు జరిమానా కట్టాల్సిందే!
Follow us on

కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ‘సామాజిక దూరం’ సరైన అస్త్రమంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు యూపీలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలోకి బయటి వాళ్లెవరైనా అడుగుపెడితే రూ.5 వేలు జరిమానా విధించాలని తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాపూర్ జిల్లా బచ్రౌటా గ్రామ పెద్ద జష్వీర్ పేర్కొన్నారు.

కాగా.. లాక్ డౌన్ అమలులో ఉన్న రోజుల్లో తమ గ్రామానికి కొత్తగా ఎవరైనా వస్తే ముందు గ్రామ పెద్దకు చెబుతామనీ… తర్వాత ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బచ్రౌటా గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 109 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కోవిడ్-19 వ్యాధితో 3,666 మంది చికిత్స పొందుతుండగా.. 292 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.