కేబినెట్ భేటీలో ఇకపై నో ఫోన్స్..యూపీ సీఎం ఆదేశం

|

Jun 02, 2019 | 9:46 AM

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శించిన ఈ సీఎం… మంత్రులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జరగనున్న కీలకమైన కేబినెట్ భేటీల్లో మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. మీటింగ్‌లకు వచ్చి కూడా మంత్రులంతా మొబైల్స్ చూస్తూ వాట్సాప్‌లలో మునిగిపోతున్నారన్న దానిపై సీఎం యోగి సీరియస్ అయినట్లు సమాచారం. ఫోన్లలో మునిగిపోతూ మంత్రివర్గ సమావేశంపై మంత్రులెవరూ దృష్టి సారించడం లేదని భావిస్తున్న యూపీ ప్రభుత్వం […]

కేబినెట్ భేటీలో ఇకపై నో ఫోన్స్..యూపీ సీఎం ఆదేశం
Follow us on

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శించిన ఈ సీఎం… మంత్రులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జరగనున్న కీలకమైన కేబినెట్ భేటీల్లో మంత్రులెవరూ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. మీటింగ్‌లకు వచ్చి కూడా మంత్రులంతా మొబైల్స్ చూస్తూ వాట్సాప్‌లలో మునిగిపోతున్నారన్న దానిపై సీఎం యోగి సీరియస్ అయినట్లు సమాచారం. ఫోన్లలో మునిగిపోతూ మంత్రివర్గ సమావేశంపై మంత్రులెవరూ దృష్టి సారించడం లేదని భావిస్తున్న యూపీ ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మంత్రివర్గ సమావేశాల్లో మంత్రులు ఎవరూ మొబైల్స్ వాడకూడదంటూ నిషేధం విధించింది.

సమావేశాల్లో వారి ఏకాగ్రత దెబ్బతింటోందన్న కారణంతోనే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇకపై జరిగే సమావేశాలకు మంత్రులు ముందుగా తమ ఫోన్లను డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇలా చేయడం వల్ల సమావేశాల్లోని కీలక నిర్ణయాలను హ్యాక్ చేయడానికి కానీ, ఎలక్ట్రానిక్ గూఢచర్యం నుంచి ముప్పు కానీ ఉండదని ప్రభుత్వం పేర్కొంది.