Unwanted Hair: ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే సరి

|

Jun 03, 2021 | 5:32 PM

Unwanted Hair: అవాంఛిత రోమాలు ఎవరినైనా బాధపెడతాయి. ముఖ్యంగా మహిళల్లో చాలామందికి ఈ అవాంఛిత రోమాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది...

Unwanted Hair: ముఖంపై అవాంఛిత రోమాలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే సరి
Unwanted Hair
Follow us on

Unwanted Hair: అవాంఛిత రోమాలు ఎవరినైనా బాధపెడతాయి. ముఖ్యంగా మహిళల్లో చాలామందికి ఈ అవాంఛిత రోమాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళల ముఖంపై, పెదవుల పైభాగంలో అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతుంటారు. వీటిని తీసుకుని ముఖం అందంగా కనిపించడానికి రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ అవాంఛిత రోమాలను పోగొట్టుకోవడానికి ఇంట్లోనే చక్కటి చిట్కా ఉంది. పుదీనా టీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ టీ తయారీ విధానం చూద్దాం

పుదీనా టీ తయారీ:

ఒక కప్పు నీళ్లను తీసుకుని మరగపెట్టి అందులో ఐదు పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లను వడగట్టి పది నిమిషాల తర్వాత తాగాలి. ఇలా రోజులో రెండుసార్లు చేస్తే అవాంఛిత రోమాలు రావు.

ఒక టేబుల్‌స్పూను నిమ్మరసంలో నాలుగు టేబుల్‌స్పూన్ల తేనె కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్ల చొప్పున కొద్ది నెలలపాటు చేస్తే కూడా అవాంఛితరోమాల సమస్య తలెత్తదు.

Also Read: ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు..చెలామణిలోకి భారీగా 500 నకిలీ నోట్లు