దేశంలో ఉత్తమ వర్సిటీల్లో హెచ్‌సీయూకి రెండోస్థానం

|

Aug 03, 2020 | 5:17 AM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. ఇండియా టుడే ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన ఓ సర్వేలో హెచ్‌సీయూకి రెండోస్థానం దక్కింది.

దేశంలో ఉత్తమ వర్సిటీల్లో హెచ్‌సీయూకి రెండోస్థానం
Follow us on

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. ఇండియా టుడే ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన ఓ సర్వేలో హెచ్‌సీయూకి రెండోస్థానం దక్కింది. జనరల్‌ (ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌), సాంకేతిక, వైద్య, లాలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ అందిస్తున్న దేశంలోని 995 యూనివర్సిటీల్లో సర్వే నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా వర్సిటీ పాలనా పద్ధతులు, అకడమిక్‌, పరిశోధనలు, మౌలిక వసతులు, పర్సనాలిటీ, లీడర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌, కెరీర్‌ పురోగతి, ప్లేస్‌మెంట్లు తదితర వాటిని వర్సిటీ పనితీరుకు సూచికలుగా తీసుకున్నారు. ఆబ్జెక్టివ్‌ ర్యాంకింగ్‌ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్‌ఏ 120 ప్లస్‌ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. పది పాయింట్ల రేటింగ్‌ స్కేల్‌లో వర్సిటీల ర్యాంకులను నిర్ధారించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ మొదటిస్థానం సాధించగా, హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. మెరుగైన ర్యాంకు రావడం వర్సిటీ పరిశోధనా పద్ధతులకు గుర్తింపని హెచ్‌సీయూ వీసీ పొదిలే అప్పారావు చెప్పారు.