రియల్టర్స్ కి కేంద్ర మంత్రి ముఖ్య సూచన..!

|

Jun 04, 2020 | 7:18 PM

కరోనాతో రియల్ ఏస్టేట్ రంగం పూర్తిగా నిర్విర్యమైంది. దీంతో కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. కేంద్రమంత్రి పియూష్ గోయల్ దేశవ్యాప్త రియల్టర్స్ తో వెబినార్‌ నిర్వహణ. ధరలు తగ్గించి స్థలాలను, ఫ్లాట్లను అమ్ముకోవాలని సూచన.

రియల్టర్స్ కి కేంద్ర మంత్రి ముఖ్య సూచన..!
Follow us on

కరోనావైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. లాక్ డౌన్ తో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం దాచుకున్న సొమ్ము కాస్త నీరుగారిపోయింది. కొనుగోలు శక్తి కాస్త తగ్గి డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా రియల్ ఏస్టేట్ రంగం పూర్తిగా నిర్విర్యమైంది. దీంతో కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. కేంద్రమంత్రి పియూష్ గోయల్ దేశవ్యాప్త రియల్టర్స్ తో వెబినార్‌ నిర్వహించారు. పరిస్థితులకు అనుగుణంగా రియల్ ఏస్టేట్ బిజినెస్ ను మార్చుకోవాలని సూచించారు. మార్కెట్ పుంజుకునేంత వరకూ వేచిచూడకుండా.. ధరలు తగ్గించి స్థలాలను, ఫ్లాట్లను అమ్ముకోవాలని సూచించారు. ప్రస్తుతం జనం వద్ద డబ్బు లేక రియల్ ఏస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదని గుర్తు చేసిన మంత్రి.. ధరలు తగ్గించి అమ్ముకోవడమే మంచిదన్నారు. తద్వారా రియల్టర్లు కొంతలో కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోగలుగుతారని తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం సాయం చేయాలని రియలెస్టేట్ సంస్థలు ఆశించకూడదని మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.