కేంద్ర వ్యవసాయ బిల్లుపై అపోహలు వద్దుః నిర్మలా సీతారామన్

ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

కేంద్ర వ్యవసాయ బిల్లుపై అపోహలు వద్దుః నిర్మలా సీతారామన్

Updated on: Oct 07, 2020 | 10:58 PM

ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందులో భాగంగానే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌ బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు రైతులు, వ్యవసాయ రంగం నిపుణులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమని ఆమె అన్నారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్ చెప్పిందా లేదా అని ప్రశ్నించారు. మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని, కొత్త చట్టాలతో మార్కెట్‌కు వెళ్ళకుండానే సరుకు అమ్ముకోవచ్చని తెలిపారు. కొత్త చట్టాలతో దళారులకే నష్టమని, రైతులకు కాదని స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి మద్దతు ధర ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అతి తక్కువ వర్ష పాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కృషీ చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.