సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్..

ఏపీ సీఎం జ‌గ‌న్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతోన్న లాక్ డౌన్ పరిణామాలు.. ఆ తర్వాత ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అన్న అంశాల‌పై చ‌ర్చించారు. కరోనా క‌ట్ట‌డికి ఏపీ స‌ర్కార్ తీసుకుంటున్న చర్యల్ని హోంమంత్రికి.. సీఎం జ‌గ‌న్ వివరించారు. ప్రతి మిలియన్‌ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన‌ రాష్ట్రంగా ఏపీ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉందని.. సీఎం.. అమిత్ షాకు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం ఆఫీస్ ట్విట్ట‌ర్ […]

సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్..

Updated on: Apr 26, 2020 | 2:32 PM

ఏపీ సీఎం జ‌గ‌న్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతోన్న లాక్ డౌన్ పరిణామాలు.. ఆ తర్వాత ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అన్న అంశాల‌పై చ‌ర్చించారు. కరోనా క‌ట్ట‌డికి ఏపీ స‌ర్కార్ తీసుకుంటున్న చర్యల్ని హోంమంత్రికి.. సీఎం జ‌గ‌న్ వివరించారు. ప్రతి మిలియన్‌ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన‌ రాష్ట్రంగా ఏపీ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉందని.. సీఎం.. అమిత్ షాకు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం ఆఫీస్ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది.

మరోవైపు ఏపీలో క‌రోనా టెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది. తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య 1097కు చేరాయి. ఈరోజు మార్నింగ్ ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన‌ హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.