Breaking: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

|

Sep 14, 2020 | 9:48 PM

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రెక్కలు వచ్చినవేళ కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Breaking: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
Follow us on

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు రెక్కలు వచ్చినవేళ కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాణ్యతలేని ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తూ.. వినియోగదారులకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది ఉల్లి. ఈ నేపథ్యంలో, కేంద్రం కాస్త కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాము చెప్పేవరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లి నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది.