మారుతీరావు షెడ్‌లో మృతదేహం కేసులో మరో ట్విస్ట్…

|

Mar 01, 2020 | 10:28 PM

ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావుకి చెందిన మిర్యాలగుడలోని షెడ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభించడంతో..అతడు మళ్లీ పోలీసుల దృష్టిలో పడ్డాడు.  నార్కట్‌పల్లి అద్దంకి రహదారి వెంట మారుతీరావుకు స్థలం ఉంది. ఈ ప్లేసులో గతంలో హోటల్‌ నిర్వహించగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణపనుల సమయంలో విపరీతంగా దుమ్ము రావడంతో దాన్ని క్లోజ్ చేశారు.

మారుతీరావు షెడ్‌లో మృతదేహం కేసులో మరో ట్విస్ట్...
Follow us on

ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావుకి చెందిన మిర్యాలగుడలోని షెడ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభించడంతో..అతడు మళ్లీ పోలీసుల దృష్టిలో పడ్డాడు.  నార్కట్‌పల్లి అద్దంకి రహదారి వెంట మారుతీరావుకు స్థలం ఉంది. ఈ ప్లేసులో గతంలో హోటల్‌ నిర్వహించగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణపనుల సమయంలో విపరీతంగా దుమ్ము రావడంతో దాన్ని క్లోజ్ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉంటున్న ఆ హోటల్ షెడ్‌లో మృతదేహం వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. వారం రోజుల క్రితమే వ్యక్తి మృతదేహాన్ని గదిలో వేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్‌బాడీ పక్కనే  గోనెసంచి ఉండటంతో… మృతున్ని వేరేచోట చంపి ఇక్కడకు తరలించారా, లేక యాక్సిడెంట్‌లో చనిపోతే అనుమానం రాకుండా అక్కడ పడేశారా అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. అయితే మృతదేహం ఎవరిదనేది గుర్తుపట్టకుండా..శరీరంపై ఆయిల్‌ చల్లడం కేసులో మిస్టరీగా మారింది. శరీరమంతా చిక్కటి ఆయిల్‌ చల్లటంతో శరీరం కుళ్లడానికి ఆలస్యమై వారంరోజుల తర్వాత గానీ దుర్వాసన బయటకు రాలేదని తెలుస్తోంది. మృతుడు సుమారు 35నుంచి 40ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని అంచనా. బ్లూకలర్‌ షర్ట్‌, జీన్స్‌పాంట్‌ ధరించి ఎడమ చేతికి వాచి కలిగి ఉన్నాడు. తలవెంట్రుకలు లేకుండా ముఖం పీక్కుపోయి భరించలేని దుర్వాసన వస్తుంది.

టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతదేహం ఉన్న గదిలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నల్గొండ నుంచి క్లూస్‌ టీం బృందం వచ్చి..డెడ్‌బాడీ చేతి వేలిముద్రలను సేకరించి, మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనుమానాస్పద వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

కాగా తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకున్నందుకు మారుతీరావు 2018 సెప్టెంబర్‌లో ప్రణయ్‌ను హత్య చేయించాడు. సుపారీ ఇచ్చి మరి మారుతీ రావు ఈ హత్య చేయించగా.. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ రాగా.. ప్రస్తుతం వారు బయటనే ఉన్నారు.