భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసల వర్షం కురించింది. సైక్లోన్ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన తీరు అద్భుతమని పేర్కొంది. జీరో క్యాజువాలిటీ విధానం, అత్యంత కచ్చితత్వంలో భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే సైక్లోన్ ఫొని ప్రభావాన్ని అడ్డుకున్నాయని ఐక్య రాజ్య సమితిలోని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం ప్రశంసించింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ఓడీఆర్‌ఆర్ ప్రతినిధి డెనీస్ మెక్‌క్లీన్ జెనీవా భారత వాతావరణ శాఖను అభినందించారు. అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల వల్ల 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారని పేర్కొన్నారు.