UN On US Capitol Riots: అమెరికాలోని హింసాత్మక సంఘటనపై స్పందించిన ఐరాస, నాయకులు పరిణితితో నడుచుకోవాలని సూచన

|

Jan 07, 2021 | 4:51 PM

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలోని తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి దృష్టిసారించింది. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు..

UN On US Capitol Riots: అమెరికాలోని హింసాత్మక సంఘటనపై స్పందించిన ఐరాస, నాయకులు పరిణితితో నడుచుకోవాలని సూచన
Follow us on

UN On US Capitol Riots: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలోని తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి దృష్టిసారించింది. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు దేశ రాజధానిలో సృష్టించిన బీభత్సంపై.. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులపై యూఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు పరిణితితో నడుచుకోవాలని.. తన మద్దతుదారులను సముదాయిస్తూ… దిశానిర్ధేశం చేయాలని సూచించింది.  వాషింగ్టన్‌ డీసీ లో చోటు చేసుకున్న హింసపై UN చీఫ్  ఆందోళన వ్యక్తం చేస్తూ… ప్రజాస్వామ్య ప్రక్రియలను, చట్టలను ప్రతి ఒక్కరూ గౌరవించడం చాలా ముఖ్యమని చెప్పారు. 

అగ్రరాజ్యంలో నెలకొన్న ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ మార్పు జరిగే సమయంలో ఇటువంటి హింసాత్మక సంఘటనలకు చోటు లేదనిచెప్పారు. ఇదే అంశంపై ఐరాస జనరల్‌ అసెంబ్లీ 75వ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న వోల్కన్‌ బోజ్‌కిర్‌ స్పందిస్తూ.. హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా తమ మద్దతను దారులను రాజకీయ నాయకులూ శాంతింపజేయాలని తెలిపారు. చట్టాలను ప్రజాస్వామ్య విధాన్ని అందరూ గౌరవించాలన్నారు.