మార్క్స్ అండ్ స్పెన్సర్ లో లేఆఫ్.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్!

| Edited By:

Aug 19, 2020 | 12:04 AM

కరోనా మహమ్మారి వల్ల అమ్మకాలు పడిపోయిన కారణంగా.. నిర్వహణ, స్టోర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో బ్రిటిష్ రిటైలర్ మార్క్స్ & స్పెన్సర్ సుమారు 7,000 ఉద్యోగాలను తొలగించనున్నట్టు ప్రకటించింది. రానున్న

మార్క్స్ అండ్ స్పెన్సర్ లో లేఆఫ్.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్!
Follow us on

కరోనా మహమ్మారి వల్ల అమ్మకాలు పడిపోయిన కారణంగా.. నిర్వహణ, స్టోర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో బ్రిటిష్ రిటైలర్ మార్క్స్ & స్పెన్సర్ సుమారు 7,000 ఉద్యోగాలను తొలగించనున్నట్టు ప్రకటించింది. రానున్న మూడు నెలల్లో సెంట్రల్ ఆఫీసులలో, రీజనల్ మేనేజ్‌మెంట్, యూకే సోర్లలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నమని మంగళవారం సంస్థ తెలిపింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 9 శాతం అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు, భౌతిక దూరం నిబంధనల విషయంలో అనిశ్చితి ఉందని.. ఈ కారణంగా ఏడాది చివరి వరకు జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సంస్థ తెలిపింది.

మనుగడ కోసం కఠినమైన చర్యలు అవసరమని మార్క్స్ & స్పెన్సర్ కంపెనీ పేర్కొంది. ఆగస్టు 8వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ గ్రూప్ ఆదాయం 13.2 శాతం పడిపోయిందని.. స్టోర్లలో సేల్స్ 38 శాతం పడిపోయాయని సంస్థ పేర్కొంది. అయితే ఇతర కంపెనీల మాదిరిగానే మార్క్స్ అండ్ స్పెన్సర్ ఆన్‌లైన్‌ సేల్స్ కూడా లాక్‌డౌన్ సమయంలో విస్తృతంగా పెరిగాయి. గడిచిన ఏడాది ఇదే త్రైమాసికంలో 29 శాతం ఆర్డర్లు ఆన్‌లైన్ ద్వారా డెలివరి చేయగా.. ఈ ఏడాది 68 శాతం ఆర్డర్లు ఆన్‌లైన్ ద్వారా డెలివరి చేసినట్టు సంస్థ చెప్పుకొచ్చింది.