అక్కడా పాక్‌కు భంగపాటు.. నిజాం ఆస్తులు ఇండియాకే!
దాయాది పాకిస్థాన్‌కు మరో భంగపాటు తప్పలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన దగ్గర నుంచి పాక్ రగిలిపోతోంది. పలు విధాలుగా భారత్‌ను కించపరుస్తూ వచ్చింది. అయితే అన్ని చోట్లా కూడా దాయాది దేశానికి ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక తాజాగా నిజాం ఆస్తుల విషయంలో పాకిస్థాన్‌కు చుక్కెదురయ్యింది. హైదరాబాద్ నిజాంకు సంబంధించిన ఏడు దశాబ్దాల నాటి కేసులో భారత్‌కు ఊరట లభించింది. నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్థాన్ హైకమిషనర్‌కు పది […]
దాయాది పాకిస్థాన్‌కు మరో భంగపాటు తప్పలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన దగ్గర నుంచి పాక్ రగిలిపోతోంది. పలు విధాలుగా భారత్‌ను కించపరుస్తూ వచ్చింది. అయితే అన్ని చోట్లా కూడా దాయాది దేశానికి ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక తాజాగా నిజాం ఆస్తుల విషయంలో పాకిస్థాన్‌కు చుక్కెదురయ్యింది.
హైదరాబాద్ నిజాంకు సంబంధించిన ఏడు దశాబ్దాల నాటి కేసులో భారత్‌కు ఊరట లభించింది. నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్థాన్ హైకమిషనర్‌కు పది లక్షల పౌండ్ల నగదును నిజాం వారసులు పంపించారు. ఇక ఈ నగదు తమకే దక్కుతుందని ఇన్నాళ్లు వాదిస్తూ వచ్చింది. దీనికి తెరదించుంటూ బ్రిటన్ కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ సొమ్ము భారత్‌కే దక్కుతుందని.. పాకిస్థాన్‌కు ఈ సంపదపై ఎటువంటి హక్కు లేదని హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు తేల్చి చెప్పింది.
బ్రిటిన్‌లోని నాటి పాకిస్థాన్ హైకమిషనర్ ఇబ్రహీం రహ్మతుల్లాకు పంపిన ఈ నగదుపై ఏడు దశాబ్దాలుగా కేసు నడుస్తోంది. లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంకు(నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్) లో రహ్మతుల్లా ఖాతాలో ఈ సొమ్ము ఉంది. వడ్డీతో కలిపి ఇప్పుడు అది మూడున్నర కోట్ల పౌండ్లకు చేరుకుంది.. అది ఇండియన్ కరెన్సీలో కౌంట్ చేస్తే దాదాపు 306 కోట్ల రూపాయలు. ఇక ఈ తీర్పుపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు, ప్రస్తుత నిజాం ముకరం జా కజిన్ నజఫ్ అలీ ఖాన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో దాయాది పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం దృష్టిలో మరోసారి అవమానానికి గురైనట్లయింది.
అసలు జరిగిందేంటంటే…
1947లో భారతదేశం విభజన సమయంలో హైదరాబాద్‌ను భారత్‌లో కలపాలా.? లేక పాకిస్థాన్‌లో కలపాలా.? అని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంశయంలో ఉన్నారు. ఆ క్రమంలో 1948లో హైదరాబాద్ నిజాం బ్రిటన్లోని పాకిస్థాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహముతుల్లాకు పది లక్షల పౌండ్ల సొమ్మను పంపి సురక్షితంగా ఉంచామని కోరారు. లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్ పీఎల్‌సీలో ఈ నిధులు ఉన్నాయి. ఇక ఆ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు ప్రిన్స్ ముకరంజా, ముఫఖంజా వాదిస్తూ వచ్చారు. వారికి భారత్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది.
అయితే ఆయుధాల కొనుగోలు నిమిత్తం నిజాం ఆ నగదును పంపారని.. కావున అది తమకే చెందుతాయని పాకిస్థాన్ పేర్కొంటూ లండన్ రాయల్ కోర్టును ఆశ్రయించింది. 70 ఏళ్లుగా సాగిన ఈ వాదోపవాదనలు విన్న బ్రిటన్ కోర్టు నిజాం సొమ్ము ఆయన వారసులు, భారత ప్రభుత్వానికి చెందుతాయని తీర్పునిచ్చింది. అంతేకాక విదేశీ చట్టం ప్రకారం పాకిస్థాన్ వాదన న్యాయవిరుద్దామని కొట్టిపారేసింది. కాగా, ఈ తీర్పుతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ సమాజంలో మరో పరాభవం చవి చూసింది. భారత్‌పై ఎన్నిసార్లు ఎదురుదాడికి దిగినా పాకిస్థాన్ ఓటమి చెందుతున్నా.. వక్ర బుద్దిని మాత్రం మార్చుకోవట్లేదు.