కాసేపట్లో యూజీసీ నెట్-2020 అడ్మిట్ కార్డులు

యూజీసీ నెట్ (UGC-NET) జూన్ లేదా సెప్టెంబ‌ర్ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మరికాసేపట్లో  విడుద‌ల చేయ‌నుంది. జేఆర్ఎఫ్ (JRF) లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్...

కాసేపట్లో యూజీసీ నెట్-2020 అడ్మిట్ కార్డులు

Updated on: Sep 10, 2020 | 5:44 PM

‌యూజీసీ నెట్ (UGC-NET) జూన్ లేదా సెప్టెంబ‌ర్ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మరికాసేపట్లో  విడుద‌ల చేయ‌నుంది. జేఆర్ఎఫ్ (JRF) లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి అధ్యాప‌క పోస్టుల‌కు సంబంధించిన ఈ అర్హ‌త ప‌రీక్షను రెండు విడుత‌ల్లో నిర్వ‌హించనున్నారు. కరోనా ఆంక్షలను అనుసరిస్తూ పరీక్షలకు కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు.. మరికొన్ని రూల్స్ ను వెల్లడించనుంది.

మొద‌టి విడ‌తలో భాగంగా సెప్టెంబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు, రెండో విడుత సెప్టెంబ‌ర్ 21 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అడ్మిట్‌కార్డులు యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nic.inలో అందుబాటులో ఉంటాయి.