అల్పపీడనంతో భారీ వర్షాలు.. అధికారులతో మంత్రి బాలినేని సమీక్ష

|

Sep 14, 2020 | 2:40 PM

అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు అలతాకుతలం చేస్తున్నాయి.. అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా వ్యవహరించాలని అయా జిల్లాల అధికారులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

అల్పపీడనంతో భారీ వర్షాలు.. అధికారులతో మంత్రి బాలినేని సమీక్ష
Follow us on

అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు అలతాకుతలం చేస్తున్నాయి.. పులిమీద పుట్రలా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర సమీపానికి చేరుకుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన ఈ అల్పపీడనం రేపటికల్లా మరింత బలపడి రానున్న నాలుగు రోజులపాటు పశ్చిమ వాయువ్యంగా పయనించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్రలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. కోసాంధ్ర తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది..

మరోవైపు, అల్పపీడన పరిస్థితులపై అప్రమత్తంగా వ్యవహరించాలని అయా జిల్లాల అధికారులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులలో కోవిడ్ విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు లేకుండా చూడాలని, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆదేశించారు.