నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం మోటార్ బైక్‌పై వెళ్తున్నవారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఉదయగిరి మండలం వడ్లమూడిపల్లికి చెందిన దంపతులు గంగి శ్రీనివాసులు రెడ్డి, రత్నమ్మలు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో వడ్లమూడిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారు చనిపోయారన్న సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
