Telangana Politics: కేటీఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మధ్య ట్విట్టర్ వార్.. మధ్యలో ఎంటరై సెటైర్లు వేసిన కిషన్ రెడ్డి..

Telangana Politics: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌షుక్ మాండవ్యా మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది.

Telangana Politics: కేటీఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మధ్య ట్విట్టర్ వార్.. మధ్యలో ఎంటరై సెటైర్లు వేసిన కిషన్ రెడ్డి..
Ktr Vs Mandaviya

Updated on: Aug 30, 2022 | 3:43 PM

Telangana Politics: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌షుక్ మాండవ్యా మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. తెలంగాణకు మోదీ ప్రభుత్వం మంజూరీ చేసిన మెడికల్‌ కాలేజీలు సున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ట్విట్‌కు స్పందించిన మన్‌షుక్.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి అందిన ప్రతిపాదనలు సున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. దానికి స్పందించిన కేటీఆర్.. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నుంచి వచ్చిన లేఖను జతచేస్తూ ట్వీట్‌ చేశారు. ఇక కేటీఆర్‌ జత చేసిన హర్షవర్ధన్‌ లేఖలో 3వ పేరా చదవాలని సూచించారు మన్‌షుక్‌ మాండవ్యా. లేఖలకు కాలేజి మంజూరీ చేయరని, పద్దతి ప్రకారం డీపీజీలు సమర్పిస్తేనే మెడికల్‌ కాలేజి స్కీమ్‌ వర్తిస్తుందన్నారు మన్‌షుక్‌ మాండవ్యా. అయితే, కేటీఆర్‌-మన్‌షుక్‌ మాండవ్యా ట్విట్టర్‌ వార్‌లోకి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎంటరయ్యారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. డీపీఆర్‌లు సమర్పించాలంటే చాలా కష్టపడి పని చేయాల్సిఉంటుందని, ఫామ్ హౌజ్‌లో కూర్చున్న వాళ్లకు డీపీఆర్‌లు తయారీ చేయడం కష్టమంటూ కిషన్ రెడ్డి వరుస ట్వీట్లు చేస్తూ టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డీపీఆర్‌ అంటే డైలీ ప్రభుత్వాన్ని తిట్టడం అంటూ కిషన్ రెడ్డి సెటైర్ వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..