AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాన‌ని గాయం : జంట పేలుళ్ల‌కు 13 ఏళ్లు

ఆగస్టు 25.. 2007...గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం వేళ రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శ‌బ్దంతో పేలాయి.

మాన‌ని గాయం : జంట పేలుళ్ల‌కు 13 ఏళ్లు
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2020 | 11:02 AM

Share

ఆగస్టు 25.. 2007…గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం వేళ రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శ‌బ్దంతో పేలాయి. ఉగ్ర‌వాదుల మార‌ణ హోమంలో 40 మందిగా పైగా మృత్యువాతపడ్డారు. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. ఈ జంట పేలుళ్లు జ‌రిగి నేటికి 13 ఏళ్లు. పేలుళ్ల తర్వాత సిటీలోని ర‌ద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన‌ పోలీసులు…19 బాంబులను గుర్తించి పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్ల వ‌ల్ల గాయ‌ప‌డిన కొంద‌రు ఇప్ప‌టికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంక‌ర ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు.

కాగా పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది.  ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ద‌ర్యాప్తు అనంత‌రం శిక్ష ఖ‌రారు చేసింది. కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషిగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు. శిక్ష ఖరారు చేసినప్ప‌టికీ వివిధ కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికీ తీర్పు అమలుకాలేదు. కాగా జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మక్కా పేలుళ్ల అనంత‌రం పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

Follow Us
ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్లి చూడగా
ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్లి చూడగా
ఏపీలో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్
ఏపీలో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త..
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్..
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్..
జస్ట్ 10 నిమిషాలు చాలు.. ఇంట్లోనే అమృతాన్ని తయారు చేసుకోవచ్చు..
జస్ట్ 10 నిమిషాలు చాలు.. ఇంట్లోనే అమృతాన్ని తయారు చేసుకోవచ్చు..
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
భర్తతో విడాకులు.. ప్రియుడితో బ్రేకప్.. డేటింగ్ పై హీరోయిన్ రియాక్
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
ఏపీలో మరో 6 లైన్ల నేషనల్ హైవే.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మహిళకు ఉబెర్ డ్రైవర్ అసభ్యకరమైన మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?
బెంగళూరులో వర్షం కురిసే అవకాశం..ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా?