Twenty three candiates in Dubbaka by-poll: తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచేది ఎందరో తేలిపోయింది. సోమవారం సాయంత్రానికి నామినేషన్ల ఘట్టం ముగియడంతో పోటీలో వున్న మొత్తం అభ్యర్థులెవరో తేటతెల్లమైంది. బరిలో చాలా మందే కనిపిస్తున్న ప్రధాన పోటీ మాత్రం మూడు రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్యనే వుందనేది నిర్వివాదాంశం. సో.. దుబ్బాకలో త్రిముఖ ఖాయమైంది.
దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 11 మంది నామినేషన్లు సోమవారం నాటికి ఉపసంహరించుకున్నారు. మరో పన్నెండు మంది నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 23 మంది బరిలో నుంచి వెళ్ళిపోగా.. మిగిలిన 23 మంది ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల అనివార్యమైంది. అధికార టీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే సతీమణి సుజాతకు టిక్కెట్ ఇవ్వగా.. చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. కాగా బీజేపీ తరపున గత మూడు ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావునే ఆ పార్టీ మళ్ళీ బరిలో దింపింది.
మూడు ప్రధాన పార్టీల తరపున బరిలో వున్న ముగ్గురి మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని చిన్నాచితకా పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తుండడంతో ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగిరి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య 23గా మిగిలింది. నామినేషన్ల పర్వం ముగిసిపోవడంతో అభ్యర్థులు ఇక ప్రచారం జోరు పెంచనున్నారు.
Also read: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… నర్తనశాలపై ప్రకటన
Also read: వరద బాధితులకు ‘మేఘా‘ సాయం.. సీఎంఆర్ఎఫ్‌కు పదికోట్లు
Also read: హైదరాబాద్‌కు రూ. 550 కోట్లు: కేసీఆర్ ప్రకటన
Also read: ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ… ఈసారి టాపిక్ ఇదే!
Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్
Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!
Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్
Also read: త్వరలో తెలంగాణకు కేంద్ర బృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి