మూడు రోజులు నిర్విరామ నడక.. మరో గంటలో ఇల్లు చేరబోతుండగా..

| Edited By: Anil kumar poka

Apr 21, 2020 | 1:39 PM

లాక్ డౌన్ కారణంగా రైళ్లు, బస్సులు లేవు. వేలాది వలస జీవులకు తమ ఊళ్లు చేరాలంటే కాలి  నడకే శరణ్యం.. ఈ క్రమంలో తెలంగాణలోని మిర్చి పొలాల్లో పని చేసే 12 ఏళ్ళ బాలిక.. ఛత్తీస్ గడ్ లోని తన సొంత జిల్లా బీజాపూర్ కు ఇలాగే కాలి నడకన బయలుదేరింది.

మూడు రోజులు నిర్విరామ నడక.. మరో గంటలో ఇల్లు చేరబోతుండగా..
Follow us on

లాక్ డౌన్ కారణంగా రైళ్లు, బస్సులు లేవు. వేలాది వలస జీవులకు తమ ఊళ్లు చేరాలంటే కాలి  నడకే శరణ్యం.. ఈ క్రమంలో తెలంగాణలోని మిర్చి పొలాల్లో పని చేసే 12 ఏళ్ళ బాలిక.. ఛత్తీస్ గడ్ లోని తన సొంత జిల్లా బీజాపూర్ కు ఇలాగే కాలి నడకన బయలుదేరింది. ఈ నెల 15 న తన స్నేహితులతో కలిసి మూడు రోజులపాటు.. 150 కిలోమీటర్ల దూరం.. అడవుల్లోనే ఆమె నడక సాగింది. జమ్లు మక్దూమ్ అనే ఈ బాలిక ఇక తన ఇంటిని గంటలో చేరబోతుండగా.. సరైన ఆహారం, నీరు లేక డీహైడ్రేషన్ కారణంగా.. కడుపు నొప్పితో సొమ్మసిల్లి ఈ నెల 18 న ప్రాణాలు విడిచింది. తన కూతురు తెలంగాణాలోని  మిర్చి పొలాల్లో రెండు నెలలుగా పని చేస్తోందని ఆమె తండ్రి ఆండోరం మక్దూమ్ విలపిస్తూ చెప్పాడు. ఈ బాలిక కుటుంబానికి ఛత్తీస్ గడ్ ప్రభుత్వం లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.