ఈఎన్‌బిఏ అవార్డుల్లో సత్తా చాటిన టీవీ9 తెలుగు

| Edited By:

Oct 18, 2020 | 9:14 PM

హైదరాబాద్: టీవీ9.. భారత్‌లో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్. ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ దూసుకెళుతున్న టీవీ9 తెలుగుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వార్త కవరేజ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. ఎక్స్‌ఛేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డ్స్(ఈఎన్‌బిఏ)లో టీవీ9 తెలుగు ఛానల్ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ కవరేజ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన అమరనాథ్ యాత్రను కవర్ చేసినందుకు గానూ టీవీ9 తెలుగుకి ఈ అవార్డు […]

ఈఎన్‌బిఏ అవార్డుల్లో సత్తా చాటిన టీవీ9 తెలుగు
Follow us on

హైదరాబాద్: టీవీ9.. భారత్‌లో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్. ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ దూసుకెళుతున్న టీవీ9 తెలుగుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వార్త కవరేజ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది.

ఎక్స్‌ఛేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డ్స్(ఈఎన్‌బిఏ)లో టీవీ9 తెలుగు ఛానల్ సత్తా చాటింది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ కవరేజ్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన అమరనాథ్ యాత్రను కవర్ చేసినందుకు గానూ టీవీ9 తెలుగుకి ఈ అవార్డు దక్కింది. నోయిడాలో జరిగిన ఈ కార్యక్రమంలో టీవీ9 ప్రతినిధులు అవార్డును స్వీకరించారు.

ఇది ఈఎన్‌బిఏ అవార్డుల 11వ ఎడిషన్. నోయిడాలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఉన్న మీడియా సంస్థలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత్‌లో టీవీ మీడియా భవిష్యత్తును నిర్ణయించే విధంగా అడుగులు వేస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించే మీడియా సంస్థలకు ఈఎన్‌బిఏ అవార్డులు దక్కుతాయి.

ఏబీపీ న్యూస్, ఆజ్ తక్, ఎన్డిటీవీ, న్యూస్ 9, ఇండియా టుడే టీవీ, జీ న్యూస్, పిటిసి న్యూస్, టీవీ9 మరాఠి, టీవీ9 కన్నడ, టీవీ9 తెలుగు, సీఎన్ఎన్ న్యూస్ 18, మిర్రర్ నౌ, బిబిసి న్యూస్ హింది తదితర మీడియా సంస్థలకు అవార్డులు దక్కాయి.

జర్నలిజంలో టీవీ9 ఉత్తమ విలువలు పాటిస్తుందనడానికి ఈ అవార్డులే నిదర్శనం. తెలుగు ప్రజలకు టీవీ9 తెలుగుపై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూ మరింత ఉత్తమంగా పని చేసే దిశగా టీవీ9 తెలుగు దూసుకెళుతోంది.