టీవీ9 ఆపరేషన్‌ మంగీ ఎఫెక్ట్: ఆదివాసీలకు ప్రత్యేక వైద్య క్యాంపులు, సరుకుల పంపిణీ

|

Nov 07, 2020 | 11:21 AM

టీవీ9 జరిపిన ఆపరేషన్‌ మంగీకి వైద్యశాఖ, పోలీసుల నుంచి విశేష స్పందన వచ్చింది. మంగీ అడవుల్లోని ఆదివాసి ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తున్నారు. ఆదివాసీల కోసం పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వైద్యాధికారులు ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటుచేసి.. ఆదివాసీలకు వైద్యసాయం అందిస్తున్నారు. మరోవైపు దుప్పట్ల, వస్తువులు, నిత్యావసరాలు పంపిణీ కూడా చేశారు. ఆదివాసీలకు అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరించవద్దని హెచ్చరించారు. కాగా, ఆపరేషన్‌ మంగీ పేరుతో.. టీవీ9 అక్కడి ఆదివాసీల కష్టాలను వెలుగులోకి […]

టీవీ9 ఆపరేషన్‌ మంగీ ఎఫెక్ట్: ఆదివాసీలకు ప్రత్యేక వైద్య క్యాంపులు, సరుకుల పంపిణీ
Follow us on

టీవీ9 జరిపిన ఆపరేషన్‌ మంగీకి వైద్యశాఖ, పోలీసుల నుంచి విశేష స్పందన వచ్చింది. మంగీ అడవుల్లోని ఆదివాసి ప్రాంతాల్లో పోలీసులు పర్యటిస్తున్నారు. ఆదివాసీల కోసం పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వైద్యాధికారులు ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటుచేసి.. ఆదివాసీలకు వైద్యసాయం అందిస్తున్నారు. మరోవైపు దుప్పట్ల, వస్తువులు, నిత్యావసరాలు పంపిణీ కూడా చేశారు. ఆదివాసీలకు అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరించవద్దని హెచ్చరించారు. కాగా, ఆపరేషన్‌ మంగీ పేరుతో.. టీవీ9 అక్కడి ఆదివాసీల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు క్రమంగా ప్రబలుతున్న ప్రాంతం కావడంతో.. సాహసోపేతంగా అక్కడి విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య మంగీ వాసులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు అండగా ఉంటే.. తమకు వేరే సాయం అక్కర్లేదని అక్కడి స్థానికులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో.. ఆసిఫాబాద్‌ ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణ అక్కడి ప్రాంతాలను సందర్శించి.. స్పెషల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. మంగీ , టోకిగూడ , మాణిక్యపూర్ వాసులతో మాట్లాడారు. పోలీసులు మీ కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు.. ఉద్యోగ ఉపాధిలో పోలీసుల సాయసహకారాలు నిత్యం ఉంటాయన్నారు ఎస్పీ సత్యనారాయణ.