నటుడు సిద్దు విసిరిన సవాల్ స్వీకరణ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద మొక్కలు నాటిన బుల్లితెర నటుడు ప్రియతమ్

|

Jan 27, 2021 | 4:51 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బుల్లితెర నటుడు ప్రియతమ్ స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని..

నటుడు సిద్దు విసిరిన సవాల్ స్వీకరణ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద మొక్కలు నాటిన బుల్లితెర నటుడు ప్రియతమ్
Follow us on

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బుల్లితెర నటుడు ప్రియతమ్ స్వీకరించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ప్రియతమ్ తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యువనటుడు అభిప్రాయపడ్డాడు. నటుడు సిద్దు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రియతమ్, అనంతరం మరో ముగ్గురు నటులకి సవాల్ చేశాడు. రాజ్ కుమార్, హర్షిత వెంకటేష్, శ్యామ్ కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరాడు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పలువురు మొక్కలు నాటుతుండటం తెలిసిందే.