వైసీపీ ఓ రౌడీ పార్టీ: తులసీరెడ్డి ఎంత మాటనేశారు?

ఏపీలో పాలకపక్షంగా మారిన వైసీపీ ఓ వీధి రౌడీ పార్టీ అన్నారు ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసీరెడ్డి. వారం క్రితం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అపాయింట్ అయిన తులసీరెడ్డి బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించిన తులసీరెడ్డి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభత్వాలపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పడాలని తులసీరెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టి భరతమాత బానిస సంకెళ్లను తెంచిన పార్టీ కాంగ్రెస్ […]

వైసీపీ ఓ రౌడీ పార్టీ: తులసీరెడ్డి ఎంత మాటనేశారు?

Updated on: Jan 29, 2020 | 4:43 PM

ఏపీలో పాలకపక్షంగా మారిన వైసీపీ ఓ వీధి రౌడీ పార్టీ అన్నారు ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసీరెడ్డి. వారం క్రితం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అపాయింట్ అయిన తులసీరెడ్డి బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించిన తులసీరెడ్డి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభత్వాలపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పడాలని తులసీరెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టి భరతమాత బానిస సంకెళ్లను తెంచిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్న తులసీరెడ్డి.. బీజేపీ అంటే బరితెగించిన పార్టీ అని ఆరోపించారు. ప్రత్యేక హోదా విభజన హామీలకు బీజేపీ మంగళం పడిందని గుర్తు చేశారు.

టీడీపీ అంటే తినడం.. దోచుకోవడం… పంచుకోవడం అన్న చందంగా ఉందన్న ఏపీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రౌడీ పార్టీ అని అభివర్ణించారు. ఇంటింటా సౌభాగ్యం వెల్లివిరియాలి అంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ, వైసీపీ.. బీజేపీ చేతిలో కీలుబొమ్మలని, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ కాపాడుతుందని చెప్పుకొచ్చారు తులసీరెడ్డి.