తిరుమలలో ఏసీ గదుల అద్దెలు పెరిగాయ్…

|

Sep 16, 2020 | 10:43 AM

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులు విషయంలో మరింత భారం కానుంది.

తిరుమలలో ఏసీ గదుల అద్దెలు పెరిగాయ్...
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులు విషయంలో మరింత భారం కానుంది. ఏసీ గదుల అద్దెలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణ గదుల అద్దెలు పెంచకుండా కేవలం ఏసీ విశ్రాంతి గృహాల అద్దెలను మాత్రమే టీటీడీ పెంచింది. దీంతో గత కొంతకాలంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునేపనిలో పడింది టీటీడీ. గత ఏడాది నవంబర్ లోనే పెంచిన టీటీడీ మరోసారి ఏసీ గదుల అద్దెలను పెంచింది. ప్రస్తుతం రూ.వెయ్యి గా ఏసీ గదుల ధరలను రూ.1500 కి పెంచింది. అలాగే, భక్తులు సౌకర్యార్థం 120 ఏసీ గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో మధ్యతరగతి వారికి మరింత భారం పడుతుంది. అయితే, మిగతా నాన్ ఏసీ గదుల అద్దెల్లో ఏలాంటి మార్పు ఉండబోదని టీటీడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దెలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతికాగా, రూ.999, రూ.1500 ఏసీ సౌకర్యం ఉంటుంది.