సిబ్బందికి టీటీడీ ఈవో సింఘాల్ చివరిమాట

|

Oct 02, 2020 | 7:54 PM

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భవిష్యత్తులో కూడా సమిష్టిగా పనిచేసి భక్తులకు మెరుగైన సేవలందించాలని టీటీడీ ఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్న అనిల్ కూమార్ సింఘాల్ కోరారు. టీటీడీలో 3 సంవత్సరాల 5 నెలలు సేవలందించడంపై చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా వెళ్తున్న అనిల్ సింఘాల్ తో టీటీడీ అధికారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి సింఘాల్ కృతజ్ఞతలు […]

సిబ్బందికి టీటీడీ ఈవో సింఘాల్ చివరిమాట
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భవిష్యత్తులో కూడా సమిష్టిగా పనిచేసి భక్తులకు మెరుగైన సేవలందించాలని టీటీడీ ఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్న అనిల్ కూమార్ సింఘాల్ కోరారు. టీటీడీలో 3 సంవత్సరాల 5 నెలలు సేవలందించడంపై చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా వెళ్తున్న అనిల్ సింఘాల్ తో టీటీడీ అధికారులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి సింఘాల్ కృతజ్ఞతలు చెప్పారు.