చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించాలనే సామాజిక దృక్పథంతో తీసిన సినిమా ఇది : వై.వి.సుబ్బారెడ్డి

లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధాకృష్ణ'. ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 'ఢమరుకం' శ్రీనివాసరెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించారు.

చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించాలనే సామాజిక దృక్పథంతో తీసిన సినిమా ఇది : వై.వి.సుబ్బారెడ్డి

Updated on: Dec 21, 2020 | 5:48 PM

లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విడుదలచేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించాలనే సామాజిక దృక్పథంతో సినిమాను నిర్మించడం అభినందనీయం అని అన్నారు. నిర్మల్‌ కొయ్య బొమ్మల కళాకారుల నైపుణ్యాల్ని, వారు పడుతున్న ఇబ్బందులను వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించారు’ అని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది కళాకారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమా చేయాలన్న ఆలోచన బాగుందని అన్నారు. ఈ సినిమాను రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరించాలని వైవి సుబ్బారెడ్డి అని తెలిపారు.