బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మె.. రిటైర్డ్ జడ్జీల కమిటీకి.. నో చెప్పిన ప్రభుత్వం!

| Edited By: Pardhasaradhi Peri

Nov 13, 2019 | 1:54 PM

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై గత కొద్దిరోజులుగా ఎడతెగని విచారణ కొనసాగుతున్నా.. సమ్మెకు మాత్రం పరిష్కారం లభించలేదు. దీంతో చివరి అవకాశంగా హైపవర్ కమిటీ వేయాలని న్యాయస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేసి.. సమ్మె పరిష్కారాన్ని వారికే అప్పగించాలని భావించింది. ఇక నిన్నటి విచారణ సందర్భంగా దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అటు ఈ కమిటీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెపై […]

బ్రేకింగ్: ఆర్టీసీ సమ్మె.. రిటైర్డ్ జడ్జీల కమిటీకి.. నో చెప్పిన ప్రభుత్వం!
Follow us on

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై గత కొద్దిరోజులుగా ఎడతెగని విచారణ కొనసాగుతున్నా.. సమ్మెకు మాత్రం పరిష్కారం లభించలేదు. దీంతో చివరి అవకాశంగా హైపవర్ కమిటీ వేయాలని న్యాయస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేసి.. సమ్మె పరిష్కారాన్ని వారికే అప్పగించాలని భావించింది. ఇక నిన్నటి విచారణ సందర్భంగా దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

అటు ఈ కమిటీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఆర్టీసీ సమ్మెపై హైపవర్ కమిటీ అవసరం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. సమ్మె అంశం లేబర్ కోర్టు పరిధిలో ఉన్నందున ముగ్గురు జడ్జీల కమిటీ అవసరం లేదని.. చట్టప్రకారం లేబర్ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతో కాసేపట్లో హైకోర్టు సమ్మెపై ఎటువంటి తీర్పు ఇవ్వనుందో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.