ఆర్టీసీపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అశ్వత్థామ రెడ్డి..!

| Edited By:

Nov 06, 2019 | 4:53 PM

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీపై జరగుతోన్న రచ్చ తెలిసిందే. ఆర్టీసీని.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ప్రభుత్వంలో విలీనం చేసేది కుదరదని.. సీఎం కేసీఆర్ ఫైనల్‌గా చెప్పేశారు. దీంతో.. కొంతమంది విధుల్లో చేరారు. మిగతావారు ఆర్టీసీ స్ట్రైక్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. అశ్వత్థామ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టు […]

ఆర్టీసీపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అశ్వత్థామ రెడ్డి..!
Follow us on

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో ఆర్టీసీపై జరగుతోన్న రచ్చ తెలిసిందే. ఆర్టీసీని.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ప్రభుత్వంలో విలీనం చేసేది కుదరదని.. సీఎం కేసీఆర్ ఫైనల్‌గా చెప్పేశారు. దీంతో.. కొంతమంది విధుల్లో చేరారు. మిగతావారు ఆర్టీసీ స్ట్రైక్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. అశ్వత్థామ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన.. ఆయన మిలియన్ మార్చ్‌ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికి కూడా.. ఆర్టీసీ జేఏసీ.. ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉందని.. ఇంకా సమ్మెను జఠిలం చేసి.. సమస్యను పెద్దది చేయొద్దని.. సీఎం కేసీఆర్‌కి విన్నవించుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్.. ఇచ్చిన డెడ్‌లైన్‌ను ఏ కార్మికుడు స్పందించలేదని.. స్వయంగా విధిల్లోకి చేరిన వారే వచ్చి మళ్లీ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నారని.. అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంపూర్ణ మద్దతు తెలిపారని.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి.. జేపీ నడ్డాను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామని వ్యాఖ్యానించారు అశ్వత్థామరెడ్డి.