అతి తెలివి వద్దు.. ఏపీ మంత్రికి పువ్వాడ ఓపెన్ ఛాలెంజ్

|

Oct 12, 2020 | 1:29 PM

ఆంధ్రప్రదేశ్ అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ టీవీ9తో అన్నారు. పేపర్లకి లీకులు ఇస్తూ డబుల్ స్టాండ్ గా వున్నారని విమర్శించారు. తెలంగాణ అధికారుల ప్రతిపాదన మేరకు లక్షా 60వేల కి.మీ ఒప్పుకుంటే అంతరాష్ట్ర సర్వీసుల ఒప్పదం చేసుకోవాలని పువ్వాడ చెప్పారు. “ఇప్పుడు నేను హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న.. టీవీ9 ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న.. ఏపీ మంత్రి వచ్చి ఒప్పందం చేసుకోవాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల […]

అతి తెలివి వద్దు.. ఏపీ మంత్రికి పువ్వాడ ఓపెన్ ఛాలెంజ్
Follow us on

ఆంధ్రప్రదేశ్ అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ టీవీ9తో అన్నారు. పేపర్లకి లీకులు ఇస్తూ డబుల్ స్టాండ్ గా వున్నారని విమర్శించారు. తెలంగాణ అధికారుల ప్రతిపాదన మేరకు లక్షా 60వేల కి.మీ ఒప్పుకుంటే అంతరాష్ట్ర సర్వీసుల ఒప్పదం చేసుకోవాలని పువ్వాడ చెప్పారు. “ఇప్పుడు నేను హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న.. టీవీ9 ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న.. ఏపీ మంత్రి వచ్చి ఒప్పందం చేసుకోవాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు 6, 7 తేదీల్లో రావాల్సింది.. కొంత ఆలస్యం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఆర్టీసీ కార్మికుల జీతాలు పడతాయి. లాక్ డౌన్ లో కూడా కార్మికుల జీతాలు వేశాము. ఇప్పటివరకు 18 వందల కోట్లు టీఎస్ ఆర్టీసీకి నష్టం వచ్చింది. ఆర్టీసీ కొరియర్ అండ్ కార్గో సర్వీస్ ద్వారా 10 లక్షల ఆదాయం వస్తుంది. తెలంగాణ ఆర్టీసీకి యూనియన్లు అవసరం లేదు. ఉద్యోగులు యూనియన్ల అవసరం లేదని రాసి ఇచ్చారు. యూనియన్ల గొడవ వాళ్ళ అంతర్గత వ్యవహారం”. అని టీవీ9కి చెప్పారు తెలంగాణ రవాణామంత్రి.