కషాయం తాగండి.. కరోనాను జయించండి..మంత్రి చిట్కాలు

|

Jul 25, 2020 | 4:58 PM

కరోనా కష్టకాలంలో అత్యవసరమైతే తప్పప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలో కషాయ పంపిణీ కేంద్రాన్నిమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో

కషాయం తాగండి.. కరోనాను జయించండి..మంత్రి చిట్కాలు
Follow us on

కరోనా కష్టకాలంలో అత్యవసరమైతే తప్పప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలో కషాయ పంపిణీ కేంద్రాన్నిమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ కషాయం ఉచిత పంపిణీ సెంటర్‌ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కషాయం తాగండి.. కరోనాను జయించండి.. ప్రభుత్వానికి సహకరించి మిమల్నీ రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు రోజూ వేడి నీరు, కషాయం తాగాలని సూచించారు. యోగా వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. సిద్దిపేటకు వచ్చే ప్రజల కోసం 3 వేడినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.