సిద్ధిపేటలో కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, ప్రజల్లో ఐక్యతా స్ఫూర్తి నింపేందుకే పతంగుల పండుగని వ్యాఖ్య

|

Jan 14, 2021 | 2:13 PM

తెలంగాణలో సంక్రాంతి పర్వదిన వేళ కైట్ ఫిస్టెవల్ సందడిగా సాగుతోంది. సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహించిన..

సిద్ధిపేటలో కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, ప్రజల్లో ఐక్యతా స్ఫూర్తి నింపేందుకే పతంగుల పండుగని వ్యాఖ్య
Follow us on

తెలంగాణలో సంక్రాంతి పర్వదిన వేళ కైట్ ఫిస్టెవల్ సందడిగా సాగుతోంది. సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ మైదానంలో నిర్వహించిన పతంగుల పండుగలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్, సిద్దిపేట పేరు దేశ రాజధాని ఢిల్లీలో వినిపించేలా ప్రజలు కృషి చేయాలన్నారు. ప్రజల్లో ఐక్యతా స్ఫూర్తి నింపేందుకే పతంగుల పండుగ నిర్వహించినట్లు ప్రకటించిన ఆయన.. రంగురంగుల కైట్ వెనుక ఉండే దారం లాంటి వాళ్లే ప్రజలని అన్నారు. మహా నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో కైట్‌ ఫెస్టివల్ నిర్వహించడం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నగరాలను శుభ్రంగా ఉంచేందుకు స్ఫూర్తి నింపేలా.. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో స్వచ్ఛ్ పతంగ్ పండుగ నిర్వహించారు. కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఉత్సహవంతులు.. బెంగళూరు, వడోదర, హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు తరలివచ్చారు.