తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్… రేపటి నుంచి టీఎస్ ఎడ్‌సెట్ -2020 కౌన్సిలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన టీఎస్ ఎడ్‌సెట్ -2020 కౌన్సిలింగ్‌ తేదీలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో కౌన్సిలింగ్ డిసెంబ‌రు 10వ తేదీ నుంచి...

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... రేపటి నుంచి టీఎస్ ఎడ్‌సెట్ -2020 కౌన్సిలింగ్
students

Updated on: Dec 09, 2020 | 5:30 AM

 TS Edcet-2020 Counseling : తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన టీఎస్ ఎడ్‌సెట్ -2020 కౌన్సిలింగ్‌ తేదీలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో కౌన్సిలింగ్ డిసెంబ‌రు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్‌ పి.రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్‌కు వచ్చే సమయంలో తీసుకురావల్సిన పత్రాల వివరాలను అధికారులు వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమోలు, తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సివుంటుందని అన్నారు. వీటితో పాటు 2020 ఏడాదిలో తీసిన తాజా ఇన్‌కమ్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 30,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 97.58 శాతం మంది విద్యార్థులు అర్హ‌త సాధించారు. ఈ ఫ‌లితాల్లో అమ్మాయిలు 76.07 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.